Kangana : సినిమాలే చాలా ఈజీ

హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్‌లోని మండి లోక్ సభ స్థానం నుంచి కంగనా రనౌత్‌ (Kangana)పోటీ చేస్తున్న విషయం తెలిసింది. దీంతో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. తనదైన శైలిలో ఓటర్లకు చేరువవుతోంది. అయితే ఎన్నికలపై, రాజకీయాలపై ఇన్‌స్టా వేదిక‌గా కంగనా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. వ‌రుస రోడ్‌షోలు, ప్రజా సభలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, పర్వత ప్రాంతాల్లో ఒక్క రోజే 450 కిలోమీటర్ల ప్రయాణం, సమయానికి తీసుకోని భోజనం, నిద్రలేని రాత్రులు.. ఇవన్నీ చూసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. సినిమాల కంటే ఎన్నిక‌ల ప్ర‌చార‌మే కష్టం. ఈ కష్టమైన పోరాటం ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఒక జోక్ లాంటివి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. కంగనా(Kangana) స్వీయ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ మూవీ ఎమర్జెన్సీ. దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. ఎన్నికల అనంతరం విడుదల కానుంది.

 

Also read :

Arrest : కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

Taiwan : కొట్టుకున్న ఎంపీలు