Karthika Masam: ఏ తిథి రోజున ఏం చేయాలి?

Karthika Masam

దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం (Karthika Masam) కానీ ఈసారి మనకు ఒకరోజు లేటుగా మొదలైంది సోమవారం దీపావళి బుధవారం నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభం కానుంది. అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

The image showcases a beautifully detailed temple complex at sunset, highlighting the intricate architecture of South Indian temples. The post text, written in Tamil, emphasizes the cultural significance of living in a town with a temple, referencing the Sangam literature 'Pattinappalai' which describes the prosperity brought by temples. The temple in the image, likely Uraiyur, was constructed by Karikalan as the central feature of the town, as mentioned in the post. The warm lighting from the setting sun enhances the grandeur of the temple's gopurams (towering gateways), creating a serene and majestic atmosphere. The image captures the essence of Tamil heritage and the importance of temples in Tamil culture.

 

 

న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||

అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.

ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం.

Image

కార్తీక శుద్ధ పాడ్యమి :తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

Image

విదియ :సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

తదియ :అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

చవితి :నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

The image depicts a vibrant and detailed illustration of Lord Kartikeya, a Hindu deity, seated on a throne with a peacock beside him. The setting appears to be a temple or a divine space, indicated by the ornate pillars and lamps in the background. Lord Kartikeya is adorned with traditional attire and jewelry, symbolizing his divine status. The post's text mentions the Shashti tithi and Moon in Krittika Nakshatra, which are astrological references, suggesting that this image is used to highlight the auspiciousness of the time for worship and reflection. The context provided by the post emphasizes the creative energy and focus on progress, aligning with the worship of Lord Kartikeya or Ganeshji.

పంచమి :దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

 

షష్ఠి :ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

The image depicts a serene, hand-crafted painting of a woman in a red and green sari, identified as Yashoda, tenderly holding baby Krishna, who has blue skin and is wrapped in cloth, emerging from a divine light under a cobra's hood, symbolizing his divine birth. In the background, a radiant figure of Goddess Durga with multiple arms and weapons appears, representing Devi Yogmaya, as mentioned in the post text for Krishna Janmashtami on August 16, 2025. The setting is a warm, traditional Indian home with a lit lamp and rustic decor, evoking devotion and festivity. No platform watermarks are present, and the composition highlights the spiritual significance of the birth of Krishna and Yogmaya, aligning with the post’s call for mantra chanting and meditation on this Maharatri.

సప్తమి :ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

అష్టమి :ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

Vishnu reclines on the serpent Ananta Shesha in a cosmic ocean setting with Lakshmi seated nearby holding a lotus. Multiple arms of Lakshmi extend holding symbolic items like a pot and conch. Flanking figures include Garuda and attendants. The scene is adorned with lamps, elephants, and golden elements on a blue background evoking divine opulence.

నవమి :నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

దశమి :నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

ఏకాదశి :దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

Image

ద్వాదశి :ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

త్రయోదశి :సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

చతుర్దశి :పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

Image

కార్తీక పూర్ణిమ :కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

కార్తీక బహుళ పాడ్యమి :ఆకుకూర దానం చేస్తే మంచిది.

విదియ :వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

తదియ :పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

A statue of Lord Ganesha, depicted with an elephant head, adorned with a golden crown and jewelry. He has four arms, holding symbolic objects, and is seated on a throne. The statue is decorated with garlands of flowers and surrounded by a backdrop of blue and white floral arrangements, with lit oil lamps at the base.

 

చవితి :రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

పంచమి :చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

షష్ఠి :గ్రామదేవతలకు పూజ చేయాలి.

Image

సప్తమి :జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

అష్టమి :కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

నవమి :వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

దశమి :అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

First image shows a statue of young Krishna adorned with gold jewelry, a peacock feather crown, and black curly hair, seated on a golden swing surrounded by red rose petals and yellow marigold flowers on a white marble altar. Second image depicts white marble statues of Radha and Krishna standing side by side on a decorated platform with yellow and red flowers, lamps, and offerings, behind a large peacock motif wall with Devanagari script inscription and an Om symbol.

ఏకాదశి :విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

ద్వాదశి :అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

త్రయోదశి :ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

Image

చతుర్దశి :ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

అమావాస్య :పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.

Image

కార్తీకమాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ నెలలో ప్రతి రోజు దేవతారాధన, దీపారాధన, స్నానం, దానం చేయడం పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతాయి.

Also read: