కార్తీక మాసం ప్రారంభం కావడంతో (Srisailam) శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు (Srisailam) నవంబర్ 21 వరకు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్తీకమాసం మొత్తం గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేశారు.
శని, ఆది, సోమ, ప్రభుత్వ సెలవులు, కార్తీక పౌర్ణమి రోజుల్లో స్పర్శ దర్శనాలు రద్దు చేయబడ్డాయి.
శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ –
“కార్తీకమాసం ఆరంభం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువైంది. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. సాధారణ రోజుల్లో మూడు విడతలుగా స్పర్శ దర్శనాలు అనుమతిస్తాం. నవంబర్ 14న మొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించబోతున్నాం. ఈనెల 31న కృష్ణమ్మకు నదీహారతి, నవంబర్ 5న జ్వాలాతోరణం నిర్వహిస్తాం,” అని తెలిపారు.
అలాగే ఆలయ ఉత్తర మాడ వీధిలో గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలిపివేసి, అయితే హోమాలు, కళ్యాణాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
ఇక మహానంది, యాగంటి, కాల్వబుగ్గ, ఓంకారం క్షేత్రాల్లో కూడా కార్తీక మాసోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు చేసి దీపాలు వెలిగిస్తూ పుణ్యఫలాన్ని పొందుతున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ మరియు టూరిజం శాఖ కూడా శ్రీశైలానికి భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు, ప్యాకేజీలు ప్రకటించాయి. పలు ప్రాంతాల నుంచి శ్రీశైల దర్శనం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.
కార్తీక మాసంలో శ్రీశైలం క్షేత్ర దర్శనం, దీపారాధన, జ్వాలాతోరణం వంటి పుణ్య కార్యక్రమాలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతతో నిండిన శ్రీశైలం వాతావరణం భక్తుల మనసులను హత్తుకుంటోంది.
ఏపీఎస్ ఆర్టీసీ మరియు టూరిజం శాఖ కూడా శ్రీశైలానికి భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు, ప్యాకేజీలు ప్రకటించాయి. పలు ప్రాంతాల నుంచి శ్రీశైల దర్శనం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.
కార్తీక మాసంలో శ్రీశైలం క్షేత్ర దర్శనం, దీపారాధన, జ్వాలాతోరణం వంటి పుణ్య కార్యక్రమాలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతతో నిండిన శ్రీశైలం వాతావరణం భక్తుల మనసులను హత్తుకుంటోంది
Also read:
- Karthika Masam: ఏ తిథి రోజున ఏం చేయాలి?
- Rashmika: అమ్మాయిలే ఎక్కువ బాధపడతారు
- OperationZ: యుద్ధానికి సిద్ధం

