లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించవద్దని కోరుతూ ఎమ్మెల్సీ కవిత (Kavitha) శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించించారు. కవిత తరపు న్యాయవాది విక్రం చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవితను (Kavitha) ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిస్తూ నిన్న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను విక్రం చౌదరి ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని స్పష్టం చేశారు. నితీశ్ రాణా పిటిషన్ పై రిప్లయ్ ఇచ్చేందుకు సీబీఐ సమయం కోరింది. ఈ మేరకు బుధవారం రోజున వాదనలు వింటామని తెలిపింది. దీంతో కవితను ప్రశ్నించేందుకు ఇచ్చిన ఆర్డర్ పై స్టేటస్ కో కొనసాగించాలని కోర్టుకు కవిత తరఫు న్యాయవాది విక్రం చౌదరి విజ్ఞప్తి చేశారు.
Also read:
- Uttam Kumar: కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అమ్మినోన్ని ఏమనాలె?
- IPL Match : సెలబ్రిటీస్ @ఉప్పల్
- Ayurvedham: అందుబాటులోకి ఆయుర్వేద మద్యం

