Kavitha: ఫ్రస్ట్రేషన్ లో కవిత

ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, ఇంట్లోకి కేసీఆర్, పార్టీలోకి కేటీఆర్ రానివ్వడం లేదని సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మట్లాడారు. ఈ క్రమంలోనే కవిత సొంత దుకాణం తెరుచుకున్నారని, ఉనికి కోసమే కవిత సీఎంను విమర్శిస్తున్నారని ఆరోపించారు. హెచ్సీఏ అవకతవకలపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని విషయాలూ బయటికి వస్తాయని అన్నారు. క్రీడల అభివృద్ధికి పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు రూ. 350 కోట్ల రూపాయలు వెచ్చిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేండ్లకే రూ. 800 కోట్లు ఇచ్చిందని అన్నారు.Kavitha రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యల పై బహిరంగంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడారని, ఇందులో దాపరికం ఏముందని అన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ గతంలోనే చెప్పారని, బీఆర్ఎస్ కు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని అన్నారు. రోజా ఇంటికి పోయి చాపల పులుసు తిని రాయలసీమ ను రతనాల సీమ చేస్తా అన్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావు, కవితకు లేదన్నారు. రాయలసీమ ఎత్తి పోతల పథకం కడుతుంటే కండ్లు మూసుకుంది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. పదేళ్ల విధ్వంసాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా సరిచేస్తున్నారని అన్నారు. సీఎంతో మాట్లాడే స్థాయి కేటీఆర్ ది కాదని అన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లో మాక్ అసెంబ్లీ పెడదామంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పార్టీ పేరు లో తెలంగాణ ను తొలగించిన చరిత్ర మీదంటూ ఎద్దేవా చేశారు.

Also Read: