గంగోత్రి సినిమాలో బాలనటిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyanram ). ఈ సినిమాలో వల్లంకి పిట్ట సాంగ్ తో ఇక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బాలు సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇక వేణు డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఈ సినిమా భారీ హిట్ కావడంతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. ఇటీవల ఉస్తాద్ అనే సినిమాలో ఈ బ్యూటీ నటించింది. అటు సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది కావ్య(Kavya Kalyanram ). తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా బ్లాక్ అండ్ రెడ్ పట్టు చీరలో మంచి నగలు ధరించి సంప్రదాయబద్దంగా ఫొటోలకు ఫోజులచ్చింది ఈ బ్యూటీ.



వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో కావ్య చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also read :
Do Aur Do Pyaar : 42 రోజులు.. ఒకే నిక్కరు
Arvind Dharmapuri : రేవంత్ బీజేపీలోకి వస్తడు

