బలగం సినిమాతో ఫేమస్ అయిన బబ్లీ బ్యూటీ కావ్యకళ్యాణ్ రామ్(Kavya Kalyanram). గంగోత్రి సినిమాలో ‘వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట’.. అంటూ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలు మూవీలో యాక్ట్ చేసింది. అలా తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి సందడి చేసింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మసూద మూవీతో హీరోయిన్ గా మారింది కావ్య. ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ గా మెప్పించింది. కమెడియన్ వేణు ఎల్దండి.. డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బలగం మూవీలో ప్రియదర్శికి జోడీగా యాక్ట్ చేసింది కావ్య. ఈ సినిమాతో ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. తన నటనతో అందరి మనసులు దోచుకుంది ఈ అమ్మడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంది.కావ్య.. హీరోయిన్ గా తన మూడో సినిమా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు సింహాతో కలిసి ఉస్తాద్ లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఆఫర్లు బాగానే ఉన్నాయని టాక్. ఇక ఈ బబ్లీ బ్యూటీ.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. తన లుక్స్ తో అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటూ నెట్టింట ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.





బ్లాక్ కలర్ బ్లౌజ్, ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీలో కావ్య అదరగొట్టేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బొమ్మ బ్లాక్ బస్టరే. ఓ ఫోటోలో కొంటెగా చూస్తోందీ అమ్మడు. మరో పిక్ లో నడుము వయ్యారంగా చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం కావ్య (Kavya Kalyanram)కొత్త పిక్స్ కు నెటిజన్లు లైకులు కొడుతూనే ఉన్నారు. ఏమా అందం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also read :
Sai Pallavi :సారీ.. నా వల్ల కాదు

