Keerthy Suresh: వరుస సినిమాలతో కీర్తి సురేశ్

keerthy suresh

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh). “నేను శైలజ” మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. “మహానటి”తో తన క్రేజ్ ను ఆమాంతం పెంచుకుంది. అనంతరం “దసరా” వంటి హిట్లతో తన దూకుడును మరింత పెంచింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లోనూ నటిస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఈ మధ్య లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా కీర్తి (Keerthy Suresh) చేస్తోంది.

Image

అలా చేస్తున్న సినిమాల్లో “రఘు తాతా” ఒకటి. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు నిన్న కీర్తి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. “పుష్ప” చిత్రానికి సీక్వెల్‌గా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పుష్పకు మించిన స్థాయిలో పుష్ప 2 ఉంటుందని మేకర్స్ కూడా చెబుతున్నారు. ఈ తరుణంలో అల్లుఅర్జున్ కి పోటీగా కీర్తి దిగుతోంది. అయితే ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా.. కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడుతుంది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని రఘు తాతా టీంకి పలువురు సూచిస్తున్నారట. రిస్క్ ఎందుకని అంటున్నారట. మరి రఘుతాతా టీం ఏం చేస్తుందో చూడాలి.

Also read: