Kanna rao : కేసీఆర్ అన్న కొడుకు పై కిడ్నాప్ కేసు

కేసీఆర్ అన్న కొడుకు   కన్నారావు(Kanna rao )పై కిడ్నాప్ కేసు.
మాజీ సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఐదుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గెస్ట్‌హౌస్‌లో ఒకరిని నిర్బంధించి దాడి చేసి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు అందిన ఫిర్యాదుపై పోలీసులు కేసు ఫైల్​ చేశారు. కన్నారావు(Kanna rao )ఓ మహిళతో కలిసి ఈ దాడికి పాల్పడ్డారని ఎఫ్​ఐఆర్ లో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒక ల్యాండ్ సెటిల్​మెంట్ కోసం ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయవర్ధన్ రావు కన్నారావును ఆశ్రయించారు. అదే సమయంలో కన్నారావుకు పరిచయస్తురాలైన బిందు మాధురి అలియాస్ నందిని చౌదరి అనే మహిళ అక్కడకు వచ్చారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వద్ద నగలు, నగదు ఉన్నాయన్న విషయం తెలుసుకుని వాటిని దోచుకోవడానికి కన్నారావు, శ్యామ్ ప్రసాద్ లతో కలిసి ఆమె ప్లాన్ వేసింది. సదరు మహిళతో పాటు మరి కొంతమంది కలిసి విజయవర్ధన్‌ రావును గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించారు. టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగ రావు, ఏసీపీ కట్టా సుబ్బయ్య తమకు క్లోజ్ అంటూ బెదిరింపులకు దిగారు. అతడిని బెదిరించి విజయ్ ఇంట్లోకి అక్రమంగా చొరబడడ్డారు. రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కన్నారావు, బిందు మాధురి, శ్యామ్ ప్రసాద్ , సంతోష్ నడిపెల్లి, తులసి రాంపై పోలీసులు కేసును నమోదు చేశారు. అప్పటి ఏసీపీ భుజంగ రావు సైతం కన్నారావుకు సహకరించాలని తనపై ఒత్తిడి తెచ్చారని, లేకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని భుజంగ రావు తనను బెదిరించినట్లు బాధితుడు ఫిర్యాదులో తెలిపారు. కాగా గతంలోనూ బిందుపై పలు కేసులు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూవివాదంలో ఇప్పటికే కన్నారావు(Kanna rao)పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Also read :

Kishan Reddy : కేసీఆర్ నన్ను అనరాని మాటలన్నడు

KomatiReddy: మూణ్నెల్లు చాలు.. బీఆర్ఎస్ పునాదులు లేపుతం