kiren rijiju: రావణుడు రేఖ దాటాడు లంక నాశనమైంది

“రావణుడు రేఖ దాటాడు… లంక నాశనమైంది!” – ఆపరేషన్ సిందూర్‌పై కిరెన్ రిజిజు(kiren rijiju) సంచలన వ్యాఖ్యలు

భారతదేశం పాకిస్తాన్‌పై నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” పై పార్లమెంట్‌లో ఇవాళ చర్చ జరగనుంది.(kiren rijiju) 
ఈ నేపథ్యంతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా కీలకంగా మాట్లాడనున్నారు.
రేపు రాజ్యసభలో కూడా చర్చ కొనసాగనుంది.

  • అయితే ఈ తరుణంలో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
    రామాయణం నుంచి ఉదాహరణ తీసుకుంటూ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
  • ‘‘రావణుడు లక్ష్మణ రేఖ దాటి లంకను నాశనం చేసుకున్నాడు…
    అలాగే పాకిస్తాన్‌ భారతదేశం గీసిన రెడ్ లైన్‌ను దాటి ఉగ్రవాద శిబిరాలను కాల్చుకోవాల్సి వచ్చింది.

    ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ చర్చ ప్రారంభమవుతోంది’’ అని రిజిజు ఎక్స్ (ట్విట్టర్) లో రాసుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ, భద్రతా వర్గాల్లో తీవ్ర స్పందన కలిగిస్తున్నాయి.

ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన సమర్థవంతమైన దాడులపై పార్లమెంటులో తీవ్ర చర్చకు సిద్ధం అవుతున్న కేంద్రం & ప్రతిపక్షాలు.

Also Read :