Kishan Reddy: దోపిడీలో, అవినీతిలో ఎలాంటి మార్పూ లేదు

Kishan reddy

హైదరాబాద్: రాష్ట్రంలో దోపిడీలో, అవినీతిలో ఎలాంటి మార్పూ రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఇవాళ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరిట దీక్షకు దిగారు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటినా పనులు ఫాం హౌజ్ దాటలేదని మండిపడ్డారు. గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు దాటినా హామీలను నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు. సోనియమ్మ రాజ్యం వస్తుంది.. 100 రోజుల్లోనే మాఫీ చేస్తామన్నారని రెండు లక్షల రుణం తీసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని మాఫీ చేస్తుందని చెప్పారని అన్నారు. ‘నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా.. మీరెక్కడున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలపై రైతులు ప్రశ్నిస్తున్నారు. మీ హామీలను అమలు చేసేదెవరు? కాంగ్రెస్ కు, రేవంత్ కు సవాల్ చేస్తున్నా.. మీ హామీల అమలుకు ఉన్న కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి. ఇది తెలంగాణ రైతులను మోసగించడమేనా చెప్పాలి. చిత్త శుద్ధి ఉంటే సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక ఏంటో రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధులెలా సమకూర్చుకుంటారో ప్రజల ముందు పెట్టాలి.. గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారు. కుటుంబ పాలన పోయి మరో కుటుంబ పాలన వచ్చింది.. ఒక వసూలు రాజ్యం పోయి.. మరో వసూలు రాజ్యం వచ్చింది.. మార్పు మార్పు అన్నారు.. కేసీఆర్ కుటుంబం పోయి.. సోనియమ్మ కుంటుంబం వచ్చింది.. దోపిడీలో , అవినీతిలో, మాట తప్పడంలో ఎలాంటి మార్పూ రాలేదు.’అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరికి రూ. 500 బోనస్ ఇవ్వాలని కోరారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు కూలీల ఖాతాల్లో రూ. 12 వేలు వెంటనే వేయాలన్నారు.

 

Also read: