వానాకాలం వస్తుండడంతో కామారెడ్డిలో(KMR) జీలుగ విత్తనాల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ ఆవరణలో గల కామారెడ్డి(KMR) సొసైటీ వద్ద మార్కెట్ యార్డులోని కౌంటర్ లో జీలుగ,పెద్ద జనుము విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఫస్ట్ రోజు కావటంతో కామారెడ్డి మండలం రైతులే కాకుండా, సదాశివనగర్, మాచారెడ్డి మండల రైతులు ఉదయం 4గంటలకే సొసైటీ వద్దకు రైతులు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చి క్యూ లైన్ లో నిల్చున్నారు. దీంతో విత్తనాల టోకెన్స్ తీసుకోవటానికి రైతులు నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి రైతులను లైన్ లో నిలబెట్టి విత్తనాలను పంపిణీ చేశారు. ఎండలో అన్నదాతల పడిగాపులు గాస్తున్నారు. విత్తనాలు సరిపడా లేకపోవడంతో తమ వంతు దాకా వస్తాయో రావోనని రైతులు ఆందోళన పడుతున్నారు.
ALSO READ :

