- పోలీసులకు ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు
- సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారని వెల్లడి
- చర్యలు తీసుకోవాలని కోరిన వెంకట రెడ్డి
హైదరాబాద్: కొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని భువనగరి పార్లమెంటు సభ్యడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (KOMATIREDDY VENKAT REDDY)బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను హత్య చేస్తామంటూ కొందరు వీడియోలు పోస్టు చేశారని తన కంప్లయింట్ లో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ మేరకు విచారణ చేపట్టారు.
ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(KOMATIREDDY VENKAT REDDY) తెలంగాణ ఉద్యమ కారుడు, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, ఆయన కొడుకును తన అనుచరులు చంపేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చెరుకు సుధాకర్ తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, తన అనుచరులు ఊరుకోరంటూ చెరుకు సుధాకర్ కుమారుడు సుహాన్ కు ఎంపీ కోమటిరెడ్డి ఫోన్ చేసి బెదిరించడం ప్రకంపనలురేపింది. తమను చంపేస్తామని బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సుహాన్ పోలీసులకు, మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డికి బెదిరింపులు రావడం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
also read:

