శివసత్తుల పూనకాలు, మల్లన్న నామస్మరణతో కొమురెల్లి (Komuravelle)మార్మోగింది. పట్నంవారం సందర్భంగా ఇవాళ 21 వరుసల పెద్దపట్నం, అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. విగ్రహాలతో అర్చకులు అగ్నిగుండాలు దాటగా.. శివసత్తులు పెద్దపట్నం తొక్కుతూ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ కు చెందిన మాణిక్య పోచయ్య కుటుంబ సభ్యులు, దుర్గరాజు యాదవ్ ఆధ్వర్యంలో పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ తోటబావి వద్ద భక్తులు భక్తిపారవశ్యంలో మల్లన్న నామస్మరణల మధ్య 21 వరుసలతో పెద్దపట్నం వేశారు. ప్రత్యేక పూజల అనంతరం సమిధలతో అగ్నిగుండాలను తయారుచేశారు.
భగభగ మండే నిప్పు రవ్వలుగా రెడీ చేశారు. ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం, అగ్నిగుండాలు దాటగానే భక్తులు వారి వెనుక వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నారు. సుమారు 30 వేల మంది భక్తులు ఈకార్యక్రమాన్ని తిలకించారు. పెద్దపట్నాలు దాటుతూ మల్లను దర్శించుకున్న శివసత్తులకు ఆలయ అర్చకులు, అధికారులు శాలువా కండువాలు, జాకెట్ పీసులు పెట్టి ఘనంగా సన్మానం చేశారు. అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేర్యాల సీఐ శ్రీను, (Komuravelle) కొమురవెల్లి ఎస్ఐ రాజు గౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలు తోట బావి వద్ద కింద పడిపోవడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

శివసత్తుల పూనకాలు, మల్లన్న నామస్మరణతో కొమురెల్లి మార్మోగింది. పట్నంవారం సందర్భంగా ఇవాళ 21 వరుసల పెద్దపట్నం, అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. విగ్రహాలతో అర్చకులు అగ్నిగుండాలు దాటగా.. శివసత్తులు పెద్దపట్నం తొక్కుతూ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ కు చెందిన మాణిక్య పోచయ్య కుటుంబ సభ్యులు, దుర్గరాజు యాదవ్ ఆధ్వర్యంలో పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ తోటబావి వద్ద భక్తులు భక్తిపారవశ్యంలో మల్లన్న నామస్మరణల మధ్య 21 వరుసలతో పెద్దపట్నం వేశారు.
ప్రత్యేక పూజల అనంతరం సమిధలతో అగ్నిగుండాలను తయారుచేశారు. భగభగ మండే నిప్పు రవ్వలుగా రెడీ చేశారు. ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం, అగ్నిగుండాలు దాటగానే భక్తులు వారి వెనుక వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నారు. సుమారు 30 వేల మంది భక్తులు ఈకార్యక్రమాన్ని తిలకించారు. పెద్దపట్నాలు దాటుతూ మల్లను దర్శించుకున్న శివసత్తులకు ఆలయ అర్చకులు, అధికారులు శాలువా కండువాలు, జాకెట్ పీసులు పెట్టి ఘనంగా సన్మానం చేశారు.
అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు గౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలు తోట బావి వద్ద కింద పడిపోవడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Also read:

