APS RTC : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ

నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. దాదాపు 20 కార్పొరేషన్లకు చైర్మన్లను అపాయింట్ చేసింది. ఇందులో టీడీపీ 16, జనసేన 3, బీజేపీకి 1 పోస్టును కేటాయించింది. నామినేటెడ్ పోస్టుల్లో ఏపీ ఆర్టీసీ(APS RTC)  ఛైర్మన్ గా కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ (APS RTC)వైస్ చైర్మన్ గా మునిరత్న, శాప్ చైర్మన్ గా రవి నాయుడు, ఏపీఐఐసీ చైర్మన్ గా మంతెన రామరాజు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ హజీజ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య నాయుడు, ట్రైకార్ చైర్మన్ శ్రీనివాసులు, మారి టైం బోర్డ్ చైర్మన్ సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్యం సుబ్బారెడ్డి,

APSRTC Chairman Mallikarjuna Reddy Comments On AP Employees PRC | APSRTC  Chairman On PRC: ఉద్యోగుల పీఆర్సీకి, ఆర్టీసీ పీఆర్సీకి సంబంధం లేదు..  సమ్మెకు వెళ్లవద్దన్న ఏపీ ఆర్టీసీ ...

టూరిజం చైర్మన్ బాలాజీ, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి, పద్మాశాలి సంక్షేమ సంస్థ చైర్మన్ గా నందం అబద్దయ్య, ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యాలరావు, ఏపీ స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్ పర్సన్ గా పీతల సుజాత, ఏపీ ఎమ్ఎస్ఎమ్ఈ కార్పొరేషన్ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్, పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తోట మెహర్ సీతారామ సుధీర్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా వజ్జా బాబు రావు, ఏపీ టిడ్కో చైర్మన్ గా వేణుములపాటి అజయ్ కుమార్ ను నియమించింది.

Also read:

Triumala : పొగాకు అవశేషాల్లేవ్

Patna : 76 పాఠశాలలు మూసివేత