పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ దర్శనం మొగులయ్యకు (KTR) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మొగులయ్య ఇవాళ (KTR) కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే, తాను కట్టుకున్న ఇంటి గోడలను కబ్జాదారులు కూల్చివేస్తున్నారని, గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడాలని వేడుకున్నారు.
దీనిపై స్పందించిన కేటీఆర్, “మొగులయ్య గారికి హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. అదేవిధంగా ఆయన భూమి సమస్యను వెంటనే పరిష్కరిస్తాం,” అని హామీ ఇచ్చారు.
తదుపరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి, మొగులయ్యకు సంబంధించిన సమస్యను తక్షణం పరిష్కరించి న్యాయం చేయాలని ఆదేశించారు.
మొగులయ్యతో కేటీఆర్ చేసిన ఈ హృదయపూర్వక చర్యపై సాంస్కృతిక వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.
Also read:

