రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) తీవ్రమైన విమర్శలు గుప్పించారు. జూరాల ప్రాజెక్ట్ ప్రమాద స్థితిలోకి వెళ్లిన ఘటనకు కేవలం 24 గంటలు గడవకముందే, హైదరాబాద్ జంటనగరాలకు తాగునీరు అందించే మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడటం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.(ktr)
ఎస్డీఎస్ఓ నివేదికను నిర్లక్ష్యం:
మంజీరా బ్యారేజీకి సంబంధించి స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (SDSO) నిపుణుల బృందం 2025 మార్చి 22న సమర్పించిన నివేదికను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని కేటీఆర్ క్షమించరాని నేరంగా అభివర్ణించారు. పిల్లర్లలో పగుళ్లు, ఆఫ్రాన్ ధ్వంసం, స్పెల్ వే దెబ్బతినడం వంటి స్పష్టమైన హెచ్చరికలు ఉన్నా ముఖ్యమంత్రి మొద్దునిద్రలేకపోవడం దురదృష్టకరమన్నారు.
ప్రాజెక్టులపై వరుసగా ప్రమాద సంకేతాలు:
ప్రస్తుతం తెలంగాణలో వర్షాల కారణంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద కూడా భారీ వరద రావడంతో పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు గుర్తించారు. ఇప్పుడే మంజీరా బ్యారేజీపై కూడా అదే తరహా ఒత్తిడి పెరిగినట్లు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యంకి నిదర్శనమని అన్నారు.
సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు:
“కేవలం రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం కాదు, ప్రజలకు నీరు, సాగుకు ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తిస్థాయి కసరత్తు చేయాలి. మేడిగడ్డ, మంజీరా బ్యారేజీలను వెంటనే రిపేర్ చేయకపోతే, కాంగ్రెస్ సర్కారును చరిత్ర క్షమించదు,” అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.
పవర్ పాలిటిక్స్ కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం:
ఇలాంటి సమయాల్లో రాజకీయ విమర్శలకు బదులుగా ప్రాజెక్టుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజల ఆవేదన వ్యక్తమవుతోంది. ఎస్డీఎస్ఓ వంటి నిపుణుల నివేదికలను తక్షణమే తీసుకొని ఇంజినీరింగ్, విపత్తు నిర్వహణ బృందాలతో సంయుక్త చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read :

