మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను 8 నెలల్లోనే కాంగ్రెస్ప్రభుత్వం అప్పులకుప్పగా మారుస్తోందని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే( KTR) కేటీఆర్ఆరోపించారు. ఇదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అని ఏద్దేవా చేస్తూ ట్విట్టర్వేదికగా ట్వీట్చేశారు. బీఆర్ఎస్ హాయంలో రాష్ట్రంలో గత ఏడాది రూ. 5 వేల 900 కోట్ల ఆదాయం మిగులుగా ఉండేదన్నారు. ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచేస్తోందని గతంలో కాంగ్రెస్ పార్టీవారు అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేశారు.

ఇప్పుడు వారు మాత్రం అప్పుల విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల రుణాల మార్కును అధిగమించారు. ఇది కూడా ఒక్క కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మించకుండానే. ఈ అద్భుతమైన రన్ రేటుతో, రాబోయే కొన్నేళ్లలో అదనంగా మరో రూ. 4-5 లక్షల కోట్ల అప్పులు చేస్తారని నేను భావిస్తున్నా. ప్రజలను విజయవంతంగా మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా పనిచేశారు’అని (KTR) కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామాల్లో డ్రైనేజీ, పారిశుద్ద్యం నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. రూ. 500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదని, కొత్తవాటికి ప్రణాళిక లేదని విమర్శించారు.

మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను 8 నెలల్లోనే కాంగ్రెస్ప్రభుత్వం అప్పులకుప్పగా మారుస్తోందని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ఆరోపించారు. ఇదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అని ఏద్దేవా చేస్తూ ట్విట్టర్వేదికగా ట్వీట్చేశారు. బీఆర్ఎస్ హాయంలో రాష్ట్రంలో గత ఏడాది రూ. 5 వేల 900 కోట్ల ఆదాయం మిగులుగా ఉండేదన్నారు. ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచేస్తోందని గతంలో కాంగ్రెస్ పార్టీవారు అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు వారు మాత్రం అప్పుల విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల రుణాల మార్కును అధిగమించారు. ఇది కూడా ఒక్క కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మించకుండానే. ఈ అద్భుతమైన రన్ రేటుతో, రాబోయే కొన్నేళ్లలో అదనంగా మరో రూ. 4-5 లక్షల కోట్ల అప్పులు చేస్తారని నేను భావిస్తున్నా. ప్రజలను విజయవంతంగా మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా పనిచేశారు’అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామాల్లో డ్రైనేజీ, పారిశుద్ద్యం నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. రూ. 500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదని, కొత్తవాటికి ప్రణాళిక లేదని విమర్శించారు.
Also read:
