KTR : మూసీలో నిలబడండి

మూసీలో నిలబడండి

మూసీ ప్రక్షాళనపై మాట్లాడుతున్న కేటీఆర్(KTR), మాజీ సీఎం కేటీఆర్ (KTR)గంట సేపు మూసీ నదిలో నిలుచోవాలని, ఒక్క గ్లాస్ మూసీ నీళ్లు తాగాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. మూసీ వాస్తవ పరిస్థితిని వివరించేందుకే సీఎం పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చెప్పి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల అప్పు చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. డీపీఆర్ కూడా మొదలుకానీ ప్రాజెక్టులో కమీషన్ల కోసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి లక్షల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు పది నెలల కాంగ్రెస్ పాలనపై రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Also read :

Revanth Reddy: రేపు సీఎం పాదయాత్ర

Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు