KTR: నీ వాళ్లే నీ గవర్నమెంట్ కూల్చేస్తారు

” అధికారం లో ఉండి కూడా రేవంత్ రెడ్డి ఎందుకింత ఫ్రస్టేట్ ఐతుండో అర్థమైతలేదు. అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాల కరీంనగర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..”జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్న.. ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు కోస్తా.. కడుపు చింపుతా.. మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా.. ఇవి మన ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు.. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబు లు అయితం. అని మాట్లాడుతున్నాడు. “జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా.. అన్న మాట కి జేబు దొంగనా..? అని జనానికి డౌట్ వస్తోంది. సెక్రటేరియట్ లో ఏదో లంకె బిందెలు ఉంటాయి.. అనుకుని వచ్చిన ఈడ అవేం లేవు ఖాళీ కుండలే ఉన్నాయి..అని అంటున్నాడని.. ఇవేం మాటలు ఇవి ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలేనా” అని కేటీఆర్ అన్నారు.
“గడ్డపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని, అర్ధ రాత్రి ఎవరు తిరుగుతరు?” మనం అర్థం చేసుకోవాలె.. అని అన్నారు.

నీ పక్కనే రెండు బాంబులున్నాయి..

“మానవ బాంబు లు కాదు నీ పక్కనే రెండు కాంగ్రెస్ బాంబులున్నాయి. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ కూల్చేస్తారు. నువ్వు ఇచ్చిన చార్ సౌ బీస్ (420) హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. నీ సీటుకి మా పార్టీ నుంచి ఎలాంటి ప్రమాదం లేదు. నీ పార్టీ నాయకులతోనే నీ సీటు కి ప్రమాదం ఉంది” జర జాగ్రత్త అని కేటీఆర్ అన్నారు.

Also read: