దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి.. కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)సూచించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్న సందర్భం ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానిగా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకుండా, దశాబ్దాకాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని అందరి కళ్లముందే కాలరాయకండి అని సూచించారు. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవని, ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డా అని కేటీఆర్ (KTR)ట్వీట్చేశారు.
Also read :
Sai Pallavi :సారీ.. నా వల్ల కాదు
Bhatti Vikramaka :నిజాలు మాట్లాడితే బెదిరిస్తుండ్రు

