కృష్ణా నదీ (Krishna River)జలాల్లో తెలంగాణ తాగునీటి అవసరాలకు 8.5 టీఎంసీల నీళ్లు దక్కనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు 5.5 టీఎంసీలు ఇచ్చేందుకు ఇవాళ జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. జలసౌధలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా తాగు అవసరాలపైనే చర్చ జరిగింది. ప్రస్తుతం జలాశయాల్లో 14 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని కేఆర్ఎంబీ తెలిపింది. ఏపీలో మంచి నీటి కొరత తీవ్రంగా ఉందని, పులిచింతల కోసం మరో సారి రివ్యూ చేస్తామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాకు చెప్పారు.
Also read :
Tammanha: మిల్కీ బ్యూటీ ఈజ్ ‘బాక్’
School Bus: స్కూల్ బస్సు బోల్తా–ఆరుగురు విద్యార్థుల మృతి

