Chilkuru: సంతానం మందు కోసం చిలుకూరుకు లక్షమంది

chilkuru

చిలుకూరుకు (Chilkuru) బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. దీంతో రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా టెంపుల్​లో ఇవాళ సంతానం లేనివారి కోసం సంతాన ప్రాప్తి దివ్యఔషధం ప్రత్యేక గరుడ తీర్థ ప్రసాదాలను ఉచితంగా ఆలయ పూజారి పంపిణీ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల నుంచి కార్లలో ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు . ఉదయం 5 గంటల నుంచే చిలుకూరు (Chilkuru) బాలాజీ దేవాలయానికి భక్తులు బారులు తీరారు. కాళీమందిర్ అప్పా జంక్షన్ నుంచి హిమాయత్ సాగర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఓఆర్ఆర్, మొయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు చిలుకూరు టెంపుల్ కు చేరుకున్నారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్​ చేస్తున్నారు . భారీగా వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిలుకూరుకు  బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. దీంతో రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా టెంపుల్​లో ఇవాళ సంతానం లేనివారి కోసం సంతాన ప్రాప్తి దివ్యఔషధం ప్రత్యేక గరుడ తీర్థ ప్రసాదాలను ఉచితంగా ఆలయ పూజారి పంపిణీ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల నుంచి కార్లలో ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు . ఉదయం 5 గంటల నుంచే చిలుకూరు  బాలాజీ దేవాలయానికి భక్తులు బారులు తీరారు. కాళీమందిర్ అప్పా జంక్షన్ నుంచి హిమాయత్ సాగర్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఓఆర్ఆర్, మొయినాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు చిలుకూరు టెంపుల్ కు చేరుకున్నారు. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్​ చేస్తున్నారు . భారీగా వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also read: