Laxman :మోదీకి సరితూగే వ్యక్తి దొరకరు

Laxman :మూడోసారి మోదీ ప్రధాని అవ్వగానే యూనిఫాం సివిల్ కోడ్ అమలు జరుగుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్(Laxman) అన్నారు. ముషీరాబాద్ లో జరిగిన బీజేపీ యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ బూతద్దం పెట్టి వెతికినా మోదీకి సరితూగే వ్యక్తి దొరకరని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ కోసం దేశం ఎదురు చూస్తుందన్నారు. మోడీకి సరితుగే నాయకులే లేరన్నారు. యువత మొత్తం మోదీ వెంట ఉన్నారన్నారు. మోదీ ముందు చూపుతో వనరులు సృష్టిస్తున్నారని తెలిపారు. 5 వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందన్నారు. కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ కూడా మతపరమైన రిజర్వేషన్లు లేవని, కాంగ్రెస్ మొదటిసారి మైనార్టీలకు రిజర్వేషన్లు అందించిందన్నారు. కుల పరమైన రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అప్పట్లో నెహ్రూ కూడా ప్రయత్నించారని చెప్పారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో 70% ఓటింగ్ నమోదు అయ్యేలా చూసే బాధ్యత యువత తీసుకోవాలని సూచించారు. సికింద్రబాద్ లో కిషన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ALSO READ :