లీగల్ థ్రిల్లర్ అభిమానులకు శుభవార్త. ‘లీగల్లీ వీర్’ (Legally Veer) సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన (Legally Veer) చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాకి రవి గోగుల దర్శకత్వం వహించగా, సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. కథానాయకుడు వీర్ రెడ్డి వృత్తిరీత్యా లాయర్ కావడం విశేషం. లీగల్ థ్రిల్లర్ చేయాలనే ఆలోచనతో, తానే స్వయంగా కథానాయకుడిగా నటించారు.
ఈ చిత్రంలో దయానంద్ రెడ్డి, తనూజా పుట్టాస్వామి, ప్రియాంక రౌరి, లీల సామ్సన్, ఢిల్లీ గణేశన్, గిరిధర్ వంటి ప్రతిభావంతులైన నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
‘లీగల్లీ వీర్’ సినిమాలో రియల్ కోర్టు ప్రొసీజర్స్, లీగల్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయో ప్రేక్షకులకు చూపించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. అలాగే మర్డర్ మిస్టరీ కథా సరళిలో తండ్రి-కొడుకు సెంటిమెంట్ కూడా బలంగా చూపించారు.
ఇప్పుడీ సినిమా లయన్స్ గేట్ ప్లేలో టాప్ 5 ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. నిర్మాత శాంతమ్మ మలికిరెడ్డి మాట్లాడుతూ, “ఈ సినిమా మా కుటుంబానికే కాదు, న్యాయ వృత్తికి గౌరవం తీసుకొచ్చింది. ఇది నా భర్తకు అంకితం చేసిన చిత్రం,” అని తెలిపారు.
లాయర్‌గా జీవితం, న్యాయం కోసం పోరాటం, భావోద్వేగం, మిస్టరీ — ఇవన్నీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక లీగల్ డ్రామాగా ‘లీగల్లీ వీర్’ నిలిచిపోయింది.
Also read:

