ప్రతి మండలంలో ప్రజలకు భూ సేవలను సులభంగా అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) వెల్లడించారు. ఈనెల 19న శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ పూర్తి చేసిన సర్వేయర్లకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు (Ponguleti) తెలిపారు.
ఈ సందర్భంగా సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మొదటి విడతలో 7,000 మందికి శిక్షణ ఇవ్వగా, 3,465 మంది అర్హత సాధించారని తెలిపారు. రెండో విడతలో మరో 3,000 మందికి ఆగస్టు 18 నుంచి శిక్షణ ప్రారంభమైందని, ఈనెల 26న జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష జరుగనున్నట్లు చెప్పారు.
ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల అప్రెంటిస్ శిక్షణ ఇస్తారని, వీరి సేవలు డిసెంబర్ రెండో వారం నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజలకు సులభంగా భూ సేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈనెల 19న శిల్ప కళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇవాళ సచివాలయంలోని తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ తొలివిడతలో ఏడు వేల మందికి శిక్షణ ఇవ్వగా.. 3,465 మంది అర్హత సాధించారని తెలిపారు. రెండో విడతలో మరో మూడు వేల మందికి ఆగస్టు 18వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభించామని.. ఈనెల 26న జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో క్వాలిఫై అయ్యిన వారికి 40 రోజుల పాటు అప్రంటిస్ శిక్షణ ఉంటుందని.. వీరి సేవలు కూడా డిసెంబర్ రెండో వారం నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
Also read:

