టాలీవుడ్ నటి రకుల్ (Rakul) ప్రీత్ సింగ్ఎంటర్ ప్రెన్యూర్ గాను దూసుకుపోతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోందీ అమ్మడు. ఇంతకుముందు ఎఫ్ 45 పేరుతో జిమ్ ల వ్యాపారంలోకి దిగిన రకుల్ (Rakul) ప్రీత్ మెట్రో నగరాల్లో జిమ్‌లను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు తన మొదటి డైన్-ఇన్ రెస్టారెంట్‌ను ప్రారంభించి ఆశ్చర్యపర్చనుంది. ఆరంభం- మిల్లెట్ పేరుతో ఏప్రిల్ 16న నగరంలోని మాదాపూర్‌లో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ అండ్ బీ క్లౌడ్ కిచెన్ ఆపరేటర్ సహకారంతో ఈ రెస్టారెంట్ ప్రారంభించనుంది.
ఆరంభం – మిల్లెట్‌తో మొదలవుతుంది అనేది ట్యాగ్ లైన్. ధాన్యం పోషక విలువల ఆధారంగా ప్రత్యేకమైన డైన్-ఇన్ కాన్సెప్ట్ మిల్లెట్-సెంట్రిక్ మెనూని ఈ రెస్టారెంట్ అందిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, స్వయంగా ఫిట్నెస్ ఔత్సాహికురాలు, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు, ప్రజల శ్రేయస్సును పెంపొందించడం కోసం రెస్టారెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తారు. ‘హైదరాబాద్‌లో నా మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందరికీ రుచికరమైన, పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యమిది. ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా ఆత్మకు కూడా అవసరమని నేను నమ్ముతున్నాను. ఆరంభంలో మేము దీన్ని అందించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకేసారి ఒక పోషకాలతో మిల్లెట్ గిన్నె అందిస్తాం’ అంటోంది రకుల్. ఎఫ్ –45 జిమ్ ల తరహాలోనే రెస్టారెంట్ లను విస్తరించే ఆలోచన ఉందనీ అంటోంది.

Also read: