జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (KTR) బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠకు ముగింపు లభించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఉపఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR) కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్‌తో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ,
“రాష్ట్రమంతా ఒక తీర్పునిస్తే హైదరాబాదులో మాత్రం బీఆర్‌ఎస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలి. మాగంటి గోపీనాథ్ సేవలను కొనసాగించేందుకు ఆయన సతీమణి సునీత ముందుకు వచ్చారు. అందరూ ఆశీర్వదించాలి” అని పిలుపునిచ్చారు.
జాయింట్ వెంచర్ సర్కార్: కేటీఆర్ విమర్శ
కాంగ్రెస్, బీజేపీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వమే రేవంత్ రెడ్డి సర్కార్ అని కేటీఆర్ విమర్శించారు.
చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండా ప్రభుత్వం ఏర్పడిందని ఆయన ఆరోపించారు.
“ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమే. బస్తీ ప్రజలు ఎప్పుడెప్పుడు తమ ఇళ్లు కూలగొడతారో అని భయంతో ఉన్నారు” అన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజలే తమను తాము నష్టపరచుకున్నట్టేనని హెచ్చరించారు.
“కేసులకు భయపడి లీడర్లు కాలేరు. న్యాయం, ధర్మం కోసం పోరాడాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అలాగే, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఎద్దేవా చేస్తూ, “మోదీ దగ్గర స్కూల్, చంద్రబాబు దగ్గర కాలేజీ, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ చెప్పుకుంటాడు. కేసీఆర్ దగ్గర హైస్కూల్‌లో చదువుతుంటే ఫెయిల్ అయ్యాడని పార్టీ నుంచి వెళ్లగొట్టారు” అంటూ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ రెడ్డి సర్కార్ అని కేటీఆర్‌విమర్శించారు. చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఫైర్అయ్యారు. ‘ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమే. బస్తీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తమ ఇంటిని కూలగొడుతుందో అని భయంతో బతుకుతున్నరు. కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే మీ వేలుతో మీ కంటినే పొడుచుకున్నట్టే. కేసులకు భయపడితే లీడర్లు కాలేరు. న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడాలి. మోదీ దగ్గర స్కూల్ కు, చంద్రబాబు దగ్గర కాలేజీకి వెళ్లి, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని రేవంత్ చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ దగ్గర హైస్కూల్ చదువుతుంటే ఫెయిల్ అయిండని పార్టీ నుంచి వెళ్లగొట్టారు’ అంటూ కేటీఆర్ చురుకలంటించారు.
Also read: