BJP: బీజేపీకి మ్యాజిక్ ఫిగర్

BJP

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ (BJP)నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ సాధించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీజేపీ (BJP) 296 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే గతానికి భిన్నంగా ఇండియా కూటమి ఈ సారి బాగా పుంజుకొంది. 228 స్థానాల్లో ముందంజలో ఉండటం విశేషం. అమేథీ నుంచి బరిలోకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. రాయ్ బరేలి, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలుపు బాటన పయనిస్తున్నారు.

Image

రెండు లక్షలకు పైగా మెజార్టీతో ముందున్నారు. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత వెనుకబడినా.. ప్రస్తుతం 99 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. యూపీలో ఇండియా కూటమి భారీ ఆధిక్యతలను సాధిస్తోంది. మొత్తం 80 స్థానాలకు గాను ఎస్పీ 36 చోట్ల, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, రాష్ట్రీయ లోక్ దళ్2 చోట్ల లీడ్ లో ఉన్నాయి. బీజేపీ (BJP) 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏఎస్ పీకేఆర్ ఒక స్థానంలో లీడ్ సాధించింది. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో బీజేపీ (BJP) క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ అధికార ఆప్​ కు ఒక్క సీటు కూడా రాకపోవడం గమనార్హం. కేరళలో అధికార ఎల్ డీఎఫ్​ వెనుకబడగా.. యూడీఎఫ్​ ముందుంది. తెలంగాణలో (BJP) బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్​ ఫైట్ కొనసాగుతోంది. రెండు పార్టీలు ఎనిమిదేసి స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఎప్పటిలాగే ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ లీడ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం గమనార్హం.

Also read: