Maharashtra: నాగ్ పూర్ లో ఉద్రిక్తత

Maharashtra

మహారాష్ట్రం (Maharashtra) లోని శంభాజీ నగర్ లోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ.. బజరంగదళ్ కార్యకర్తలు నిన్న నాగ్ పూర్ లోని మహల్ ప్రాంతంలో నిన్న నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారి తీసింది.

Imageఈ ప్రదర్శన సందర్భంగా ఒక వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్వాలి, గణేశ్​పేట ముందుగా మొదలైన హింస చిట్నీస్​ పార్క్, శుక్రవారి తలావ్​ ప్రాంతాలకు పాకింది.

Imageఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో పలువురు (Maharashtra) పోలీసులు సహా మొత్తం 20 మంది గాయపడ్డారు. ఘర్షణలకు కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఔరంగజేబు స్మారకం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

కొత్వాలి, గణేశ్ పేట్, లకడ్​గంజ్, పచ్పావులి, శాంతినగర్, సక్కర్ దర, యశోధర నగర్​, కపిల్​ నగర్​, నందన్​వన్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Image

మహారాష్ట్రంలోని శంభాజీ నగర్ లోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ.. బజరంగదళ్ కార్యకర్తలు నిన్న నాగ్ పూర్ లోని మహల్ ప్రాంతంలో నిన్న నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రదర్శన సందర్భంగా ఒక వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులతో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొత్వాలి, గణేశ్​పేట ముందుగా మొదలైన హింస చిట్నీస్​ పార్క్, శుక్రవారి తలావ్​ ప్రాంతాలకు పాకింది. ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు.

Imageషాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు సహా మొత్తం 20 మంది గాయపడ్డారు. ఘర్షణలకు కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఔరంగజేబు స్మారకం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కొత్వాలి, గణేశ్ పేట్, లకడ్​గంజ్, పచ్పావులి, శాంతినగర్, సక్కర్ దర, యశోధర నగర్​, కపిల్​ నగర్​, నందన్​వన్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Image

Also read: