Mahesh Goud : బీఆర్ఎస్ మూడు ముక్కలు!

బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలు కాబోతోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో అదును కోసం హరీష్ రావు ఎదురు చూస్తున్నారని అన్నారు. దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని అన్నారు. ఇంట్లో కుంపటిని తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారని చెప్పారు. ఏకుకు మేకులా మరో పవర్ సెంటర్ పార్టీలో రావడంతో మతిభ్రమించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పిదాలను కవిత ఎత్తి చూపారని అన్నారు. బీఆర్ఎస్ తప్పిదాలు ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కు నోటీసులు వెళ్లడంతో కేటీఆర్ భయపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉన్నట్టు కవిత వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని అన్నారు. కేసిఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలని అన్నారు. పదేళ్ల అవినీతిలో పంపకాల్లో వచ్చిన తేడాతోనే, కవిత జెండా ఎగరవేసినట్లు అర్థమవుతుందన్నారు. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బిఆర్ఎస్ ఉండదని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) చెప్పారు.

Also read :