యాభై రెండేండ్ల వయస్సులో 20 ఏళ్ల కాలేజీ క్వీన్ ను తలపిస్తోంది (Malaika Arora) మలైకా అరోరా. ఫిట్ నెస్ విషయంలో రాజీ పడని ఈ ముద్దుగుమ్మ.. తన అందం వెనుక ఉన్న రహస్యమేమిటో చెప్పేసింది. ప్రముఖ బాలీవుడ్ నటి .. ఫిట్నెస్ ఐకాన్ అయిన మలైకా అరోరా యోగా, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడంలో టిప్స్ చెబుతూ ఇంటర్నెట్ లో ఎంతో పాపులరైన విషయం తెలిసిందే. మలైకా ఆరోగ్య రహస్యం, దిన చర్యపై అందరూ ఆసక్తిని కనబర్చుతున్నారు. ఒక ప్రత్యేక మైన రసం తాను నిత్యం తీసుకుంటానని చెబుతోందీ భామ.
అదేమిటంటే ఏబీసీ జ్యూస్! ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ల మిశ్రమం అని అర్థం. మలైకా అరోరా ఉదయం 10 గంటలకు తాగుతుందట. ఈ రసం తాజా పండ్లు, కూరగాయల మిశ్రమం. ఇందులో తేలికపాటి అల్లం కూడా కలుపుతానని చెప్పింది. యాపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని, ఇది జీర్ణక్రియను మెరుగు పర్చుతుందని చెప్పింది. క్యారెట్లలో విటమిన్ ఏ, ఈ, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయని, ఇవి కండ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపింది. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, రక్తాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయని తెలిపింది.

అదే విధంగా అల్లం శీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణ క్రియలను మెరుగు పర్చుతుందని తెలిపింది. ఈ జ్యూసే తన ఆరోగ్య రహస్యమని తెలిపింది మలైక.
యాభై రెండేండ్ల వయస్సులో 20 ఏళ్ల కాలేజీ క్వీన్ ను తలపిస్తోంది (Malaika Arora) మలైకా అరోరా. ఫిట్ నెస్ విషయంలో రాజీ పడని ఈ ముద్దుగుమ్మ.. తన అందం వెనుక ఉన్న రహస్యమేమిటో చెప్పేసింది.
ప్రముఖ బాలీవుడ్ నటి .. ఫిట్నెస్ ఐకాన్ అయిన మలైకా అరోరా యోగా, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడంలో టిప్స్ చెబుతూ ఇంటర్నెట్ లో ఎంతో పాపులరైన విషయం తెలిసిందే. మలైకా ఆరోగ్య రహస్యం, దిన చర్యపై అందరూ ఆసక్తిని కనబర్చుతున్నారు. ఒక ప్రత్యేక మైన రసం తాను నిత్యం తీసుకుంటానని చెబుతోందీ భామ. అదేమిటంటే ఏబీసీ జ్యూస్! ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ల మిశ్రమం అని అర్థం. మలైకా అరోరా ఉదయం 10 గంటలకు తాగుతుందట.
Also read:

