Malla Reddy:ఇంతకూ మల్లారెడ్డి చదివింది ఏ కాలేజీలో..!

Minister Malla Reddy:ఇంతకూ మల్లారెడ్డి చదివింది ఏ కాలేజీలో..!

పాలమ్మిన.. పూలమ్మిన.. బోర్ వెల్ నడిపిచ్చిన.. చిట్ ఫండ్ నడిపిచ్చిన.. కాలేజీలు పెట్టిన.. మెడికల్ కాలేజ్ లు పెట్టిన అంటూ దండకం వేసే మల్లారెడ్డి.. (Malla Reddy)ఏ కాలేజిలో చదువుకున్నారు.. ఎంతవరకు చదుకున్నారు.. తెలిస్తే షాక్ అవుతారు.. 1973లో తాను ఇంటర్మీడియట్ చదివినట్టు చెప్తున్న ఆయన మూడు కాలేజ్ లుమార్చాడు.. అదేంటిఅనుకుంటున్నారా..? 2014 లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు.. ప్యాట్నీ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చదినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.. 2018 లో మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో ఇంటర్ చదివినట్టు ఈసీ కి అఫిడవిట్ ఇచ్చారు.. 2023 లో నామినేషన్ అఫిడవిట్ లో మరోసారి కాలేజీ మార్చారు.. ఇప్పుడు మాత్రం తాను రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజిలో చదివినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.. ఇంతకు మల్లారెడ్డి (Malla Reddy)ఇంటర్ చదివారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.. 9 ఏండ్ల లో మూడు కాలేజీ లు మార్చి.. అఫిడవిట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఆ నలుగురి అఫిడవిట్లు ఆగమాగం..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న నామినేషన్ తో పాటు సమర్పించే అఫిడవిట్లలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో లీగల్ టీమ్ ను ఏర్పాటు చేసి మరీ నామినేషన్ పత్రాలు పూర్తి చేయించినా.. ఈ సారి ఇబ్బందులు తప్పేలా లేవు. గత టర్మ్ లో 19 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లలో దొర్లిన తప్పులు కోర్టు మెట్లెక్కించిన విషయం తెలిసిందే. వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు సైతం పడింది. దీంతో వారు సుప్రీంకోర్టను ఆశ్రయించి ఉపశమనం పొందారు. ఈ సారి మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)తన అఫిడవిట్ లో ఇంటర్మీడియట్ చదివినట్టు చూపించారు. 2014 లో ఒక కాలేజీలో ఇంటర్ చదివినట్టు.. 2018 అఫిడవిట్ లో మరో కాలేజీలో, 2023లో (ప్రస్తుతం) ఇంకో కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నట్టు పేర్కొన్నారు. 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి ఇచ్చిన అఫిడవిట్‌లో ఆయన ప్యాట్నీలోని ప్రభుత్వ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్లు తెలిపారు. 2018లో మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు సికింద్రాబాద్ వెస్లీ కాలేజీవలో 1973లో ఇంటర్ చదివినట్లు పేర్కొన్నారు. 2023లో మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో ఆయన రాఘవ లక్ష్మీదేవి గవర్నమెంట్ కాలేజీలో 1973లో ఇంటర్ చదివినట్లు తెలిపారు. మల్లారెడ్డి (Malla Reddy)ఇంటర్ చదివింది 1973లోనే అని 3 అఫిడవిట్లూ చెబుతున్నాయి. కానీ.. 3 కాలేజీల్లో చదవడమేంటి? ఇదెలా సాధ్యమైంది? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పువ్వాడ అజయ్ అఫిడవిట్ లో లోపాలను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎత్తి చూపుతున్నారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ప్రిస్క్రైబ్ డ్ ఫార్మాట్ లో లేదంటున్నారు. కాలమ్ లను మార్చేశారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఇద్దరు భార్యలున్నారు. ఆ విషయం అఫిడవిట్ లో ప్రస్తావించకపోవడడం గమనార్హం. అలంపూర్ నుంచి బరిలోకి దిగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ పథకం లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన అఫిడవిట్ పైనా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి.
గతంలో 19 మందిపై కేసులు
గత శాసనసభలో 19 మంది అభ్యర్థులు ఎలక్షన్ కేసులు ఎదుర్కొన్నారు. వీరిలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ సైతం ఉండటం గమనార్హం. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఏకంగా అనర్హత వేటు పడింది. అయితే వాళ్లు సుప్రీంకోర్టను ఆశ్రయించడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. అంతలోనే శాసన సభ రద్దు కావడం గమనార్హం.

Read More: