కారు ఫ్రంట్సీట్ కోసం యువకుడు కన్న తండ్రినే చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలో(Delhi) చోటుచేసుకుంది. సురేంద్ర సింగ్(60), దీపిక్(26) తండ్రీ కొడుకులు. సరేంద్ర సింగ్ సీఐఎస్ ఎఫ్ ఎస్ఐ గా పనిచేసి ఇటీవల రిటైర్‌అయ్యారు. ఈ క్రమంలో వారు ఢిల్లీ(Delhi) నుంచి సొంతూరు ఉత్తరాఖండ్‌కు వెళ్లేందుకు ఓ టెంపోను అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఫ్రంట్సీట్లో ఎవరు కూర్చోవాలనేదానిపై తండ్రీ కొడుకులు గొడవ పడ్డారు. ఆవేశంలో దీపక్ తన తండ్రిని ఆయన లైసెన్స్డ్ గన్‌తోనే కాల్చి చంపారు. కొద్ది దూరంలోనే ఉన్న పోలీసులు ఈ గన్సౌండ్ విని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం దీపక్ చేతిలో ఉన్న గన్ని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. ఆపై సురేంద్ర సింగ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :

