Revanth :మన్మోహన్​గొప్ప మానవతావాది

revanth reddy

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth) నివాళి అర్పించారు. బెళగావి నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి మన్మోహన్​నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్​పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దీపాదాస్​మున్షీ, టీ పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​గౌడ్, ఎంపీలు ఉన్నారు,

Manmohan Singh Passes Away: Top 5 Achievements As India's Prime Minister -  Oneindia News

నిర్ణయాల తీసుకోవడంలో సమగ్రత
మాజీ పీఎం మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది, అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth) పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతిపై ట్విట్టర్​లో తన సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. నిర్ణయాల తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని సీఎం రేవంత్ రెడ్డి (Revanth) కొనియాడారు. రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని పేర్కొన్నారు.

 

Also read :

Annamalai : అన్నామలై.. 6 కొరడా దెబ్బలు

P.V.Sindhu : శ్రీవారి సేవలో పీవీ సింధు దంపతులు