Chhattisgarh: భారీ ఎన్ కౌంటర్

Chhattisgarh

14 మంది మావోయిస్టులు మృతి  (Chhattisgarh) ఛత్తీస్ గఢ్– ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 14 మంది మృతి చెందారు. ఒక జవాన్ గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల్లో ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. చిత్తూరు జిల్లా బంగారు పాలెంకు చెందిన ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి తలపై కోటీ రూపాయిల రివార్డు కూడా ఉంది.. అనేక విధ్వంసకర కార్యక్రమాలకు అతడిదే మాస్టర్ మైండ్ .. 2011లో మల్కన్ గిరి కలెక్టర్ వినిత్ ను కిడ్నాప్ చేసింది కూడా ఈయనే.

నిన్న సాయంత్రం నుంచి గరియాబంద్‌, నౌపాడ జిల్లాల్లో (Chhattisgarh) ఛత్తీస్ గఢ్ కి చెందిన డిఆర్జీ, కోబ్రా బలగాల తో పాటు ఒడిస్సా రాష్ట్రం చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా కూంబింగ్ ప్రారంభించాయి. సుమారు 36 గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. నిన్న రాత్రి ఇద్దరు మహిళా నక్సల్స్ మరణించినట్టు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం మరో 12 మంది మృతదేహాలను కనుగొన్నారు. మృతుల్లో మరికొంత మంది కీలక నేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. భారీగా ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గరియా బంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రహేజా తెలిపారు. గాయపడ్డ జవాన్ ను హెలీకాప్టర్ ద్వారా తరలించి చికిత్సలు చేయిస్తున్నట్టు చెప్పారు.

14 మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్ గఢ్– ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 14 మంది మృతి చెందారు. ఒక జవాన్ గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల్లో ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. చిత్తూరు జిల్లా బంగారు పాలెంకు చెందిన ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి తలపై కోటీ రూపాయిల రివార్డు కూడా ఉంది.. అనేక విధ్వంసకర కార్యక్రమాలకు అతడిదే మాస్టర్ మైండ్ .. 2011లో మల్కన్ గిరి కలెక్టర్ వినిత్ ను కిడ్నాప్ చేసింది కూడా ఈయనే.

నిన్న సాయంత్రం నుంచి గరియాబంద్‌, నౌపాడ జిల్లాల్లో (Chhattisgarh) ఛత్తీస్ గఢ్ కి చెందిన డిఆర్జీ, కోబ్రా బలగాల తో పాటు ఒడిస్సా రాష్ట్రం చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా కూంబింగ్ ప్రారంభించాయి. సుమారు 36 గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. నిన్న రాత్రి ఇద్దరు మహిళా నక్సల్స్ మరణించినట్టు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం మరో 12 మంది మృతదేహాలను కనుగొన్నారు. మృతుల్లో మరికొంత మంది కీలక నేతలు ఉండవచ్చని భావిస్తున్నారు.

భారీగా ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గరియా బంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రహేజా తెలిపారు. గాయపడ్డ జవాన్ ను హెలీకాప్టర్ ద్వారా తరలించి చికిత్సలు చేయిస్తున్నట్టు చెప్పారు.

Also read: