–కుంగిన పిల్లర్లను పరిశీలించిన ఆరుగురు సభ్యుల కమిటీ
–బ్యారేజ్భద్రత, జరిగిన నష్టంపై ఆరా
– మీడియాను అనుమతించని పోలీసులు
భూపాలపల్లి: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (Medigadda Barrage) పిల్లర్లు కుంగిన నేపథ్యంలో.. కేంద్ర బృందం ఇవాళ ప్రాజెక్టును పరిశీలించింది. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ప్రాజెక్టును చెక్‌చేస్తోంది. అనంతరం రాష్ట్ర అధికారులతో వారు భేటీ కానున్నారు. బ్యారేజీ లోని ఆరో బ్లాక్ నుంచి ఎనిమిదో బ్లాకు వరకు, 15వ పిల్లరు నుంచి 20వ పిల్లరు వరకు నిశితంగా పరిశీలిస్తున్నారు. అనంతరం ఆ రిపోర్టును కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించనున్నారు. కాగా డ్యాం భద్రతపై కేంద్రానికి లేఖ రాసిన కిషన్ రెడ్డి.. డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు వాస్తవాలు తేల్చాలని కోరారు.
ఎవరైనా స్పందిస్తారా?: కొండా (బాక్స్)
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) పిల్లర్లు కుంగిన ఘటనపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘సీఎం కేసీఆర్ బయటకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏమైనా వివరణ ఇస్తారా? కేసీఆర్ కుటుంబం నుంచి కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ కుమార్ ప్రాజెక్టుపై ఏదైనా ప్రకటన చేస్తారా? తెలంగాణ సాగునీటి అధికారులు కాళేశ్వరంపై మాట్లాడతారా?’ అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (Medigadda Barrage) పిల్లర్లు కుంగిన నేపథ్యంలో.. కేంద్ర బృందం ఇవాళ ప్రాజెక్టును పరిశీలించింది. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ప్రాజెక్టును చెక్‌చేస్తోంది. అనంతరం రాష్ట్ర అధికారులతో వారు భేటీ కానున్నారు. బ్యారేజీ లోని ఆరో బ్లాక్ నుంచి ఎనిమిదో బ్లాకు వరకు, 15వ పిల్లరు నుంచి 20వ పిల్లరు వరకు నిశితంగా పరిశీలిస్తున్నారు. అనంతరం ఆ రిపోర్టును కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించనున్నారు. కాగా డ్యాం భద్రతపై కేంద్రానికి లేఖ రాసిన కిషన్ రెడ్డి.. డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు వాస్తవాలు తేల్చాలని కోరారు.
Read More:

