చరఖా పట్టిన మీనాక్షి(Meenakshi) – జనహిత పాదయాత్రలో ఓ ప్రత్యేక దృశ్యం
తెలంగాణలో జరుగుతున్న జనహిత పాదయాత్రలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తన భిన్నమైన శైలితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పరిగి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వద్ద శ్రమదానంలో పాల్గొన్న ఆమె, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఓ సందేశాన్ని అందించారు.(Meenakshi)
ఈ కార్యక్రమం అనంతరం స్థానిక ఎస్ గార్డెన్ లో రంగారెడ్డి జిల్లా కీలక కాంగ్రెస్ నాయకులతో మీనాక్షి సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, కేంద్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేదికపై మీనాక్షి నటరాజన్ చరఖా పట్టారు. స్వదేశీ భావాన్ని ప్రదర్శించే చరఖా ఉపయోగించి నూలు వడకడం ద్వారా స్వయం నిర్వహణ, గ్రామీణ శక్తీకరణ, గాంధీ సిద్ధాంతాలను ప్రజల మధ్యకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. నేతలకు నూలు వడకడం నేర్పించిన మీనాక్షి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో కలిసి స్వయంగా నూలు వడకడం చేసిన దృశ్యం అందరికీ ఆకర్షణీయంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రాంతీయ సమస్యలు, పార్టీ ఆర్గనైజేషన్ అంశాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా పార్టీ శ్రేణులతో నేరుగా మమేకమై, పాదయాత్రకు సామాజిక చైతన్యాన్ని కలిపిన విధానం మీనాక్షికి ప్రత్యేకతను చాటింది.
ఈ పాదయాత్ర సందర్భంగా స్థానిక ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది. చరఖా పట్టిన మీనాక్షి దృశ్యం కేవలం ఓ రాజనీతి కార్యక్రమంగా మాత్రమే కాక, చైతన్య పిలుపుగా మారింది.
Also Read :

