Minister Srinivas Goud :మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు రిలీఫ్

CM KCR:సీఎం కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్

–ఎన్నిక చెల్లదన్న పిటిషన్​కొట్టివేత
–తీర్పు వెల్లడించిన హైకోర్టు

హైదరాబాద్‌: హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు(Minister Srinivas Goud )ఊరట దక్కింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ (Minister Srinivas Goud )ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018లో శ్రీనివాస్‌ గౌడ్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులపై తప్పుడు వివరాలు అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్‌ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. లేటెస్ట్ గా​పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

Read More: