Khammam: సహాయక చర్యల్లో మంత్రులు

Khammam

భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం (Khammam) నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్ పై పర్యటించారు. బాధితుల్లో భరోసా నింపారు. మున్నేరు వాగు వరదతో ఖమ్మం (Khammam)నగరం నీట మునిగిన విషయం తెలిసిందే. పెద్ద తండా, సాయికృష్ణనగర్‌, నాయుడుపేటలో మంత్రి పర్యటించి బాధితుకు భరోసా ఇచ్చారు. సహాయక చర్యలపై అధికారులను ఆదేశించారు. తమవైపు ఎవరూ రాలేదని మంత్రి ఎదుట కన్నీరుమున్నీరైన సాయికృష్ణనగర్‌ మహిళలు మంత్రికి తెలిపారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు.

Image

భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్ పై పర్యటించారు. బాధితుల్లో భరోసా నింపారు. మున్నేరు వాగు వరదతో ఖమ్మం నగరం నీట మునిగిన విషయం తెలిసిందే. పెద్ద తండా, సాయికృష్ణనగర్‌, నాయుడుపేటలో మంత్రి పర్యటించి బాధితుకు భరోసా ఇచ్చారు. సహాయక చర్యలపై అధికారులను ఆదేశించారు. తమవైపు ఎవరూ రాలేదని మంత్రి ఎదుట కన్నీరుమున్నీరైన సాయికృష్ణనగర్‌ మహిళలు మంత్రికి తెలిపారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. బాధిత ప్రాంతాలకు వెళ్లగా తమకు న్యాయం చేయాలని బాధితులు సీతక్క కాళ్లు మొక్కడంతో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వర్షాల కు దెబ్బతిన్న ఇండ్లను మంత్రి సీతక్క ఈ సందర్భంగా పరిశీలించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని పరిశీలించారు. సూర్యాపేటలో నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువ గండి ప్రదేశాన్నిచూశారు. ప్రాజెక్టులు, కాలువల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బాధిత ప్రాంతాలకు వెళ్లగా తమకు న్యాయం చేయాలని బాధితులు సీతక్క కాళ్లు మొక్కడంతో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వర్షాల కు దెబ్బతిన్న ఇండ్లను మంత్రి సీతక్క ఈ సందర్భంగా పరిశీలించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని పరిశీలించారు. సూర్యాపేటలో నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువ గండి ప్రదేశాన్నిచూశారు. ప్రాజెక్టులు, కాలువల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Image

Also read: