Han River: సియోల్ లో మంత్రులు

Han River

సౌత్ కొరియా రాజధాని సియోల్‌లో రెండో రోజు రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నారు. హన్ నది (Han River)పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ను మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు ఈ నది కీలకంగా మారింది. కాలుష్యానికి గురైన హన్ నదిని శుభ్రపరిచి దక్షిణ కొరియా ప్రభుత్వం పునరుద్ధరించింది. మొత్తం 494 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ నది.. సియోల్ నగరంలో ఈ నదికి ఇరువైపులా 78 కిలో మీటర్ల మేర బైక్ పాత్ లు నిర్మించారు. హన్ నది సొబగులు చూసేందుకు నిత్యం లక్షా 80 వేల మంది వస్తుంటారు.

Imageపునరుజ్జీవం తర్వాత సియోల్ రూపు రేఖలు మారిపోయాయి. ఇరువైపులా 40 షాపింగ్ కాంప్లెక్స్ లు కొత్తగా ఏర్పాటయ్యాయి. వీటితోపాటు 50 కాంప్లెక్స్ లు పునరుద్ధరించారు. మరో 47 కాంప్లెక్స్ లు కూడా ఉన్నాయి. సియోల్ నగరం గ్లోబల్ పోటీలో ఏడో స్థానంలో ఉంది. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్టాడుతూ.. హన్ నది పునరుజ్జీవం అద్భుతంగా ఉందని అన్నారు. ఇదే తరహాలో మూసీని అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. అలాగే హైదరాబాద్ మహానగరాన్ని సియోల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

Image ప్రతిపక్షాలు అసత్య ప్రచారం మానుకొని హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. నదిని పరిశీలించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఉన్నారు.

సౌత్ కొరియా రాజధాని సియోల్‌లో రెండో రోజు రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నారు. (Han River)పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ను మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు ఈ నది కీలకంగా మారింది.

Imageకాలుష్యానికి గురైన హన్ నదిని శుభ్రపరిచి దక్షిణ కొరియా ప్రభుత్వం పునరుద్ధరించింది. మొత్తం 494 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ నది.. సియోల్ నగరంలో ఈ నదికి ఇరువైపులా 78 కిలో మీటర్ల మేర బైక్ పాత్ లు నిర్మించారు. హన్ నది సొబగులు చూసేందుకు నిత్యం లక్షా 80 వేల మంది వస్తుంటారు. పునరుజ్జీవం తర్వాత సియోల్ రూపు రేఖలు మారిపోయాయి. ఇరువైపులా 40 షాపింగ్ కాంప్లెక్స్ లు కొత్తగా ఏర్పాటయ్యాయి. వీటితోపాటు 50 కాంప్లెక్స్ లు పునరుద్ధరించారు. మరో 47 కాంప్లెక్స్ లు కూడా ఉన్నాయి. సియోల్ నగరం గ్లోబల్ పోటీలో ఏడో స్థానంలో ఉంది.

Image ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్టాడుతూ.. హన్ నది పునరుజ్జీవం అద్భుతంగా ఉందని అన్నారు. ఇదే తరహాలో మూసీని అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. అలాగే హైదరాబాద్ మహానగరాన్ని సియోల్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం మానుకొని హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. నదిని పరిశీలించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఉన్నారు.

Also read: