MLA: సంపన్న ఎమ్మెల్యేలు వీళ్లే!

MLA

దేశంలోని సంపన్నులైన ఎమ్మెల్యే (MLA) జాబితా విడుదలైంది. టాప్ 10 జాబితాలో మనోళ్ల జాడ కనిపించలేదు. అయితే పది మందిలో 8 మంది దక్షిణభారత దేశానికి చెందిన వారే ఉన్నారు. అందులో ఏపీ నుంచి నలుగురు, కర్నాటక నుంచి నలుగురు ఉండటం విశేషం. మొదటి స్థానంలో మహారాష్ట్ర ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరాగ్ షా (బీజేపీ) 3,383 ఆస్తులు కలిగి ఉన్నారు. రెండో స్థానం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(కాంగ్రెస్) నిలిచారు. ఆయనకు 1,413 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కర్ణాటకకు చెందిన పుట్టు స్వామి గౌడ 1,267 కోట్ల రూపాయలు ఆస్తులతో థర్డ్ ప్లేస్ లో నిలిచారు. కర్ణాటకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA) ప్రియాకృష్ణ (కాంగ్రెస్) 1,156 కోట్ల రూపాయల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(టీడీపీ) 931 కోట్ల రూపాయల ఆస్తులతో ఐదో స్థానంలో నిలిచారు. నారాయణ విద్యాసంస్థల అధినేత పీ నారాయణ(టీడీపీ) ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు సిటీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే ఆయన 824 కోట్ల రూపాయల ఆస్తులతో ఆరో స్థానంలో నిలిచారు.

Report shows Karnataka leads with country's richest MLAs amid salary hike rowఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఏడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 757 కోట్ల రూపాయలు. ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వీ ప్రశాంతి రెడ్డి 716 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. గుజరాత్ కు చెందిన ఎమ్మెల్యే జయంతీ బాయి సొంబాయి పటేల్ (బీజేపీ)661 కోట్ల రూపాయల ఆస్తులతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే సురేశా బీఎస్ (కాంగ్రెస్) 648 కోట్ల రూపాయల ఆస్తులతో పదో స్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫామ్స్ కథనం ప్రకారం… దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4,092 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ లెక్కలను ప్రకటించింది. ఇందులో నుంచి 24 మంది చదవడానికి వీల్లేకుండా ఉన్న ఎమ్మెల్యేల అపిడవిట్లను చేర్చలేదని పేర్కొంది.

Image

1861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
దేశంలోని 4092 మంది ఎమ్మెల్యేల్లో 45 శాతం మంది అంటే 1861 మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నట్టు ఏడీఆర్ తెలిపింది. వీరిలో 1,205 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అత్యాచారం లాంటి కేసులని తెలిపింది.

Image

క్రిమినల్ ఎమ్మెల్యేల్లో ఏపీ టాప్..
క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 175 మంది ఎమ్మెల్యేల్లో 138 మంది (79%) తమపై క్రిమినల్ కేసులున్నాయని అపిడవిట్లు సమర్పించారు. కేరళ, తెలంగాణతో పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. తెలంగాణ, కేరళలో 69% మంది ఎమ్మెల్యేలపై క్రమినల్ కేసులున్నాయి. బీహార్ లో 66% మంది, మహారాష్ట్రలో 65%, తమిళనాడులో 59% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి.

638 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై..
దేశవ్యాప్తంగా 1,653 మండి బీజేపీ ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించగా.. వారిలో 638(39%) మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 436 మంది(26%) సీరియస్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి 646 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 339 మంది(52%)పై క్రిమినల్ కేసులు న్నాయి. వారిలో 194 మంది (30%) సీరియస్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేల్లో 3 రాష్ట్రాల వారు 76 మంది
దేశంలోని 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేల్లో 76 మంది మూడు రాష్ట్రాలకు చెందిన వారని తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోనే ఎక్కువ మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొంది. కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 223 ఎమ్మెల్యేలు 14,179 కోట్ల ఆస్తులు కలిగి దేశంలోనే ముందు వరుసలో ఉన్నారని తెలిపింది. మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యేలు 12,424 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో 174 మంది ఎమ్మెల్యేలు 11,323 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారని వెల్లడించింది.

వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్యే ఆస్తి రూ. 1,700 మాత్రమే
దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తుల విలువను ప్రకటించిన ఏడీఆర్.. దేశంలోనే నిరుపేద ఎమ్మెల్యే ఎవరో కూడా తేల్చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ఇండస్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ కుమార్ ధారా తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా పేర్కొంది. ఆయన వద్ద కేవలం 1,700 రూపాయలు మాత్రమే ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నట్టు తెలిపింది.

Also read: