బడ్జెట్ లో హైదరాబాద్ మహానగరానికి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ (MLA Vivekananda) ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ బట్టిందని విమర్శించారు. ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇవ్వనందుకు సీఎం రేవంత్ కోపంగా ఉన్నారన్నారు. తెలంగాణ భవన్ లో ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘బడ్జెట్ ప్రసంగంలో భట్టి పచ్చి అబద్దాలు మాట్లాడారు. డ్రైనేజీ సిల్ట్ తీయటంపై కూడా భట్టి అబద్దాలు చెప్పారు. హైదరాబాద్ నగరానికి జరిగిన అన్యాయంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సిటీలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. గాంధీ, ఉస్మానియా లాంటి పేదల ఆసుపత్రులకు నిధులు కేటాయించలేదు. మెట్రోరైల్ నిర్మాణంపై నిర్దిష్ట ప్రకటన చేయలేద’న్నారు. ప్యూచర్ సిటీతో ఉన్న నగరాన్ని విస్మరించి లేని సిటీవైపు పరిగెడుతున్నారని (MLA Vivekananda) ఆరోపించారు. ఫోర్త్ సిటీ పేరుతో భుదందాలు జరుగుతున్నాయని, హైదరాబాద్ లో 45శాతం వీధిలైట్లు వెలగటం లేదని, సీసీ టీవీల నిర్వహణ కూడా ప్రభుత్వం చేయలేకపోతుందని విమర్శించారు.

బడ్జెట్ లో హైదరాబాద్ మహానగరానికి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ బట్టిందని విమర్శించారు. ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇవ్వనందుకు సీఎం రేవంత్ కోపంగా ఉన్నారన్నారు. తెలంగాణ భవన్ లో ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘బడ్జెట్ ప్రసంగంలో భట్టి పచ్చి అబద్దాలు మాట్లాడారు. డ్రైనేజీ సిల్ట్ తీయటంపై కూడా భట్టి అబద్దాలు చెప్పారు. హైదరాబాద్ నగరానికి జరిగిన అన్యాయంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సిటీలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. గాంధీ, ఉస్మానియా లాంటి పేదల ఆసుపత్రులకు నిధులు కేటాయించలేదు. మెట్రోరైల్ నిర్మాణంపై నిర్దిష్ట ప్రకటన చేయలేద’న్నారు. ప్యూచర్ సిటీతో ఉన్న నగరాన్ని విస్మరించి లేని సిటీవైపు పరిగెడుతున్నారని ఆరోపించారు. ఫోర్త్ సిటీ పేరుతో భుదందాలు జరుగుతున్నాయని, హైదరాబాద్ లో 45శాతం వీధిలైట్లు వెలగటం లేదని, సీసీ టీవీల నిర్వహణ కూడా ప్రభుత్వం చేయలేకపోతుందని విమర్శించారు.
Also read:
- Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీలకు రూ. 55 కోట్ల ఖర్చు
- Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీ నటులపై కేసులు

