కేంద్రంలో ఇప్పుడ ఏర్పడబోయో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మోదీ (modi) ఎన్నాళ్లు నడుపుతారో ఊ హించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రధానిగా మోదీ ఎన్నాళ్లు ఉంటారో కూడా తెలియదని చెప్పారు. ఆయన ఎక్కువ కాలం ప్రధానిగా ఉండక పోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉండదని వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడాలంటే విశాల హృదయం, ఓపెన్ మైండ్, అందరినీ కలుపుకొని పోయే లక్షణాలు ఉండాలని.. కానీ అవి మోదీకి లేవని గొగోయ్ విమర్శించారు.(modi) మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దివంగత అటల్ బిహారీ వాజ్పేయికి ఆ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఆయన ప్రధానమంత్రిగా ఐదేండ్లు పనిచేయడం ప్రశ్నార్థకమేనని గొగోయ్ పేర్కొన్నారు.
ALSO READ :

