మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు విధిస్తామని ప్రధాని (Modi) మోదీ అన్నారు. భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం దేశ ఆర్థిక వ్యవ్యస్థలో అనేక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉంది. నేరాలను అరికట్టేందుకు సమాజమంతా బాధ్యత తీసుకోవాలి. నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది. మధ్యతరగతి జీవుల జీవితాల్లో భాగస్వామ్యం అవుతాం. మత వివక్ష అంతానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం, దేశంలో ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలి. దేశాభివృద్ధికి ఒక దేశం-, ఒకే ఎన్నికలు అవసరం. దీనిపై రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలి. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబాలను నుంచి లక్షల మంది రావాలి. మన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదివే దుస్థితిని తగ్గిస్తం. విద్యావ్యవస్థలో శతాబ్ధాల నాటి నలందా స్ఫూర్తిని తిరిగి నిలబెట్టాలి’ అని అన్నారు.
బంగ్లాలో త్వరలోనే సాధారణ పరిస్థితులు
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు బాధాకరమని ప్రధాని మోదీ ( Modi) అన్నారు. త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు తిరిగొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బంగ్లాదేశ్లోని హిందువులు, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళలో ఉన్నారు. పొరుగు దేశాలు శ్రేయస్సు, శాంతి మార్గంలో నడవాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. దేశంలో ఒలింపిక్స్ 2036 నిర్వహించడం భారత్ కల. అందుకోసం సన్నద్ధం అవుతున్నం. తయారీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారాలి’ అని తెలిపారు.
తలపాగా.. స్పెషల్అట్రాక్షన్
2014 నుంచి ప్రతీ పంద్రాగస్టు వేడుకలకు ప్రధాని మోదీ ఒక్కో సంస్కృతి విశిష్టతను సూచించేలా తలపాగాను ధరిస్తూ వస్తున్నారు. ఇవాళ కాషాయం, పసుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న రాజస్థానీ లెహెరియా తలపాగాతో స్పెషల్అట్రాక్షన్గా నిలిచారు. రాజస్థాన్ ఎడారుల్లో గాలి కారణంగా ఏర్పడే ఇసుక తిన్నెల ఆకారాల స్ఫూర్తిగా లెహెరియా తలపాగాల డిజైన్ ఉంటుంది. కాగా.. గతేడాది పసుపు, పచ్చ, ఎరుపు రంగులతో కూడిన బంధనీ ప్రింట్ తలపాగాతో ప్రధాని కనిపించారు.
బంగ్లాలో త్వరలోనే సాధారణ పరిస్థితులు
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు బాధాకరమని ప్రధాని మోదీ ( Modi) అన్నారు. త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు తిరిగొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బంగ్లాదేశ్లోని హిందువులు, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళలో ఉన్నారు. పొరుగు దేశాలు శ్రేయస్సు, శాంతి మార్గంలో నడవాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. దేశంలో ఒలింపిక్స్ 2036 నిర్వహించడం భారత్ కల. అందుకోసం సన్నద్ధం అవుతున్నం. తయారీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారాలి’ అని తెలిపారు.
Also read:
Harish: సిగ్గు, శరం ఉంటే రాజీనామా చెయ్
Sobhita : ఐఎండీబీ సెలబ్రిటీ లిస్ట్ లో శోభిత ధూళిపాళ్ల సెకండ్