ఇరాన్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. (Mojtaba) Khamenei ను దేశ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఆయన తండ్రి Ali Khamenei మరణానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇరాన్‌లో అత్యున్నత మత-రాజకీయ సంస్థ అయిన Assembly of Experts మోజ్తబా (Mojtaba) ఖామెనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి.36 సంవత్సరాల పాటు ఇరాన్‌ను నడిపించిన అయతుల్లా అలీ ఖామెనీ ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భార్య మాన్సూరె ఖోజస్తే బఘర్జాదే తీవ్ర గాయాలతో మరణించగా, కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా ఈ ఘటనలో మృతి చెందినట్లు వెల్లడైంది.
ఖామెనీ అంత్యక్రియలు మష్హాద్‌లో నిర్వహించనున్నట్లు Islamic Revolutionary Guard Corps ప్రకటించింది. రాజధాని Tehran లో భారీ వీడ్కోలు సభ నిర్వహించనున్నారు. అధికారిక వారసుడి నియామకం ముందుగా లేకపోవడంతో తాత్కాలికంగా ఒక నాయకత్వ మండలి బాధ్యతలు చేపట్టింది. ఈ మండలిలో అయతుల్లా అలీరెజా అరఫీ, అధ్యక్షుడు Masoud Pezeshkian, ప్రధాన న్యాయమూర్తి ఘోలంహొస్సేన్ మొహ్సేని ఎజేయి ఉన్నట్లు సమాచారం.
ఇక అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన Operation Epic Fury పేరిట దాడులు అణు చర్చలు నిలిచిపోయిన తర్వాత జరిగాయని విదేశీ మీడియా పేర్కొంది. ఇరాన్ అణు కార్యక్రమాలను పునఃప్రారంభించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడుల్లో 700 మందికిపైగా మృతి చెందినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులు జరిపినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాలు ప్రభావితమయ్యాయి. ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో మరింత పెరిగాయి. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించగా, అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump యుద్ధాన్ని తప్పించుకునే అవకాశాలు తగ్గాయని వ్యాఖ్యానించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Also read:

