తాను తల్లిని కాబోతున్నట్టు తెలిపింది టాలీవుడ్ నటి శ్రద్ధా ఆర్య(Shraddha Arya) .ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రద్ధా ఆర్యకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
![]()
న్యూఢిల్లీకి చెందిన శ్రద్ధ (Shraddha Arya) 2021 నవంబర్‌లో రాహుల్ నాగల్ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో నిశ్శబ్ద్ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2007లో గొడవ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ.

ఈ సినిమాలో వైభవ్ హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రద్దా ఆర్య అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత రోమియో, కోతిమూక లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది శ్రద్ధ(Shraddha Arya).
Also read :
High Court: 15 రోజుల్లో కూల్చేయండి

