మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం
గచ్చిబౌలిలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. “మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ వంటిదే,” అనే మాటలతో ఆయన తన హిందీ పట్ల గల మద్దతును వ్యక్తం చేశారు.
హిందీని వ్యతిరేకించడం అభివృద్ధికి అడ్డు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ – “హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే. ప్రపంచ స్థాయిలో పోటీపడే అవసరమున్న యువతకు భాష ఒక సాధనంగా ఉండాలి. ఇంగ్లిష్, ఉర్దూ, పర్షియన్ భాషలను మనం అంగీకరించగలిగితే, హిందీని ఎందుకు వ్యతిరేకించాలి?” అని ప్రశ్నించారు.(Pawan kalyan)
హిందీని జాతీయ భాషగా స్వాగతిస్తున్నా.
ఇంకా ఆయన మాట్లాడుతూ – “మన రాజ్య భాష హిందీని జాతీయ భాషగా తాను స్వాగతిస్తున్నాను. ప్రాంతీయ భాషలు మన సంస్కృతి స్వరూపం అయితే, హిందీ దేశీయ ఐక్యతకు ప్రతీక.” అని చెప్పారు.
సామాజిక వర్గాల్లో చర్చలు.
ఈ వ్యాఖ్యలు ఒకవైపు హిందీ మద్దతుదారుల నుంచి ప్రశంసలు పొందుతుండగా, మరోవైపు ప్రాంతీయ భాషా పరిరక్షకులు, ముఖ్యంగా తెలుగు భాషా ఉద్యమకారులు, డ్రావిడ రాజకీయ వేత్తలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి రాష్ట్రానికి తన స్వంత గౌరవ భాష ఉంది. దాన్ని సమానంగా చూడకపోతే భవిష్యత్తులో భాషా రాజకీయాలు మరింత ముదురుతాయి,” అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ రాజకీయ ధోరణులపై అంచనాలు
జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే భాగస్వామిగా అధికారంలో ఉన్న నేపథ్యంలో, ఈ హిందీ పక్షపాత వ్యాఖ్యలు భవిష్య రాజకీయ లబ్దిలను లక్ష్యంగా చేసుకుని చేసారా? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంగా మారినాయా? అన్నదానిపై విశ్లేషణలు జరుగుతున్నాయి.
Also Read :

