మృణాల్(Mrunal) ఠాకూర్.. సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించి.. అనంతరం సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ అమ్మడు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అక్కడ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ లో ఆమె కెరీర్ ముగుస్తుందన్న సమయంలో.. అనూహ్యంగా టాలీవుడ్ లో సీతారామం సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ మూవీ మంచి హిట్ కావడంతో ఆమె(Mrunal) కెరీర్ ను అనూహ్య మలుపు తిరిగింది. ఆ తర్వాత హాయ్ నాన్నతో మరో హిట్ అందుకుంది. తాజాగా విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా కూడా ఆమెకు ఆఫర్ల బాగానే వస్తున్నట్లు సమాచారం. కానీ సౌత్ లో నటించేందుకు మృణాల్ అంతగా ఇష్టపడటం లేదట. బాలీవుడ్ వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తోందట. అక్కడ పెద్దగా క్రేజ్ లేనప్పటికీ.. హిందీలోనే సినిమా చేయాలని ఆశ పడుతుందట. సౌత్ లో తనకున్న క్రేజ్ ను చూపించి హిందీ దర్శక నిర్మాతలను ఆఫర్లు అడుగుతుందని టాక్. కాగా దీనిపై సౌత్ సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అస్సలు పద్ధతి కాదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. టాలీవుడ్ మృణాల్ కి ఎంతో చేసిందని.. అయినా కూడా కృతజ్ఞత లేకుండా బాలీవుడ్ సినిమాలపైనే ఆసక్తి చూపటం ఎంటని ప్రశ్నిస్తున్నారు.
ALSO READ :

