హాలీవుడ్ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa)ఇటీవలే విడుదలైంది. మహేశ్ బాబు వాయిస్ ఇచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొదటివారం రూ.74 కోట్లు వసూలు చేసింది. ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా కలెక్షన్ వివరాలు వెల్లడిస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇంగ్లిష్‌లో రూ.26.75 కోట్లు వసూలుచేయగా.. హిందీ, తెలుగు భాషల్లో రూ.11.2కోట్లు, రూ.11.3 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ‘ది లయన్ కింగ్’.. నాలుగేళ్ల కిందట ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దానికి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa)రూపొందింది. టైటిల్ రోల్‌కు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది.
Also read:
Manmohan Singh: మౌన మునికి మహా నివాళి
Manmohan: మన్మోహన్ ఆస్తులివే..

